ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.30 లక్షలు విరాళం
తిరుమల
టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.30 లక్షల 3 వేల రూపాయలు విరాళంగా అందింది. కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన మురళికృష్ణా ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలో టిటిడి తిరుమల జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజుకు అందజేశారు.